|
Skip Navigation Links
Home
>
GK Post
Home
Hindi GK
UPSC GK
State GK
South India
Tamil
Telugu
Kannada
Malayalam
West India
Marathi
Gujarati
MP GK
Chhattisgarh
North India
RPSC
Haryana
UP GK
Uttarakhand
Himachal
Delhi
East India
Bihar
Jharkhand
Educational Quiz
College Quiz
A-O Level
Medical
Medical-PG
Engineering
GATE
MBA-BBA
Aptitude
IT Eng.
International
USA
UK
MCQ GK
Exam Quiz
old Exams
जीवनी
नौकरी
विशेष
search
Article
ముఖ్యమైన ఆపరేషన్లు
9 Sep, 2015
Admin
ఆపరేషన్ పేరు
ఆపరేషన్ ఉద్దేశం
»
రెయిన్ బో ఈస్ట్
2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ పవన్
శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు
»
ఆపరేషన్ రెడ్ డాన్
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది.
»
ఆపరేషన్ ఓవర్ లోడ్
ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య.
»
ఆపరేషన్ ఈగల్
శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్
ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ ఆల్ క్లియర్
భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ తొపక్
మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది.
»
ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య.
»
ఆపరేషన్ సన్ షైన్
1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ చెక్ మేట్
ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు.
»
ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్
ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ స్యార్ యర్
ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు.
»
ఆపరేషన్ రెస్టోర్ హోష్
సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు.
»
ఆపరేషన్ సైలెన్స్
లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం
»
ఆపరేషన్ పుష్ బాల్
బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం
»
ఆపరేషన్ ఖఖరి
రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు.
»
ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్
బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి.
»
ఆపరేషన్ ఎర్త్ క్వేక్
ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది.
»
ఆపరేషన్ జాయింట్ ఎండీవర్
నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం.
»
ఆపరేషన్ అనకొండ
తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది.
»
ఆపరేషన్ ఒడిస్సీడాన్
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ జరోనిమా
అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ ఖంజర్
తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య.
జాతీయ స్థాయిలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు
»
ఆపరేషన్ విజయ్
1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ టోర్నడో
ముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య.
»
ఆపరేషన్ బ్లూ స్టార్
అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది.
»
ఆపరేషన్ సైక్లోన్
ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం.
»
ఆపరేషన్ కోబ్రా
జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ పరాక్రమ్
భారత పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య.
»
ఆపరేషన్ గుడ్ విల్
జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ సెర్చ్
ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య.
»
ఆపరేషన్ కూంబింగ్ -1
పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ ఉడ్ రోజ్
1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య
»
ఆపరేషన్ షాప్
1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ బ్లాక్ థండర్
1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత.
»
ఆపరేషన్ రక్షక్ 1, 2
పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ నైట్ డామినెన్స్
పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం.
»
ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్
పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు.
»
ఆపరేషన్ విన్ ఓవర్
పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ హంట్ డౌన్
సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్.
»
ఆపరేషన్ టైగర్
జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ ఫాక్స్
జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది.
»
ఆపరేషన్ విక్రమ్
ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య.
»
ఆపరేషన్ క్రాంతి
అసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది.
»
ఆపరేషన్ భజరంగ్
1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది.
»
ఆపరేషన్ రైనో
ఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్
ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే.
»
ఆపరేషన్ బ్లూ ప్రింట్
ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ సహయోగ్
అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం.
»
ఆపరేషన్ అగ్ని
ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ సైకో
హజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య.
»
ఆపరేషన్ పోలో
1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య.
»
ఆపరేషన్ లోటస్
బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం.
»
ఆపరేషన్ శాండల్ ఫాక్స్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది.
»
ఆపరేషన్ మిడ్ నైట్
సెంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ కోకూన్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య.
»
ఆపరేషన్ ధన్వంతరి
దొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ త్రీ స్టార్
పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య.
»
ఆపరేషన్ ఎక్స్
ముంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య.
ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు
»
ఆపరేషన్ తోడర్ మల్
బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ గ్రీన్ గోల్డ్
వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య.
»
ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్
చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం.
»
ఆపరేషన్ ఫ్లడ్
1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ టీ-14
పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య.
»
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్
ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు.
»
ఆపరేషన్ – 100
కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది.
»
ఆపరేషన్ సేవా
తీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం.
»
ఆపరేషన్ గజ
2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది.
»
ఆపరేషన్ ఎక్స్ లెన్స్
1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం.
»
ఆపరేషన్ దుర్యోధన్
పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది.
»
ఆపరేషన్ చక్రవ్యూహ్
ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య.
Reading Corner ( Ctrl + Mouse Click)
मूलभूत अधिकारों की सूची में से किस संविधान संशोधन द्वारा सम्पत्ति के अधिकार को हटाया गया ?
भारत में प्रच्छन्न बेरोजगारी सामान्यतः किस क्षेत्र में दिखाई देती है ?
फुटबॉल में ‘ब्लैक पर्ल’ के उपनाम से किसे जाना जाता है ?
किस शासक की मृत्यु पुस्तकालय की सीढि़यों से गिरने के कारण हुई ?
जूलियस सीजर की हत्या कब हुई थी ?
पृथ्वी की ऊपरी परत को क्या कहा जाता हैं ?
‘गैम्बिट’ शब्द किस खेल से सम्बन्धित है ?
भारत सरकार द्वारा बालकों के कल्याण के लिए ‘बाल नीति’ की घोषणा कब की गई थी ?
भारत में ब्रिटिश शासन की शुरूआत किस लड़ाई द्वारा हुई ?
संसार का विशालतम स्तनधारी कौन-सा है ?
पंचायती राज व्यवस्था सम्बन्धित प्रावधान भारतीय संविधान की किस अनुसूची में रखे गए हैं ?
‘कीर्तन’ कहाँ का प्रमुख लोक नृत्य है ?
‘लन्दन’ किस नदी के किनारे स्थित है ?
खानवां के युध्द में बाबर द्वारा पराजित किया जाने वाला राजपूत राजा कौन था ?
‘रॉकीज’, ‘एण्डीज’, ‘एटलस’, ‘आल्पस’, ‘हिमालय’ आदि किस प्रकार के पर्वत हैं ?
संसद की किस वित्तीय समिति में राज्य सभा का कोई प्रतिनिधित्व नहीं होता ?
पृथ्वी पर विशालतम जीवित पक्षी कौन-सा है ?
पेट्रोल किसका मिश्रण है ?
विश्व का सर्वाधिक ऊँचा पठार कौन-सा है ?
कम्प्यूटर की स्मृति का वह हिस्सा जहाँ डेटा, निर्देश अस्थायी रूप से सुरक्षित किया जा सकता है ?
भारत में एकल नागरिकता की अवधारणा किस देश के संविधान से अपनाई गई है ?
किस वर्ष में भारतीय कांग्रेस का गठन हुआ ?
मेसोपोटामिया की सभ्यता कहाँ विकसित हुई थी ?
हिन्दी में लिखी गई प्रसिध्द पुस्तक ‘राग दरबारी’ किसने लिखी है ?
किस सुल्तान ने बाजार नियन्त्रण व्यवस्था लागू की ?
‘विंग्स ऑफ फायर’ किसकी आत्मकथा है ?
कनिष्क किस वर्ष में राज्य सिंहासन पर आरूढ़ हुए ?
सुरक्षा परिषद में स्थायी सदस्यों की संख्या कितनी है ?
भारत में वर्तमान मुद्रा प्रणाली का प्रबंधकर्ता कौन है ?
उत्तर प्रदेश में पूर्वांचल विकास निधि योजना कब शुरू की गई ?
उत्तर प्रदेश शैक्षणिक अनुसन्धान एवं विकास परिषद् की स्थापना कब की गई ?
ऊर्जा के किस रूप से प्रदूषण की समस्या नहीं होती है ?
‘चाइनामैन’ शब्द किस खेल में सम्बन्धित है ?
प्रसिध्द नारा ‘गरीबी हटाओ’ किस पंचवर्षीय योजना के दौरान दिया गया था ?
ब्रिटिश संसद का सदस्य बनने वाला पहला भारतीय कौन था ?
Managed Services By:
www.upscgk.com
Home
About us
Services
Terms
Team
Sitemap
Contact